Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలి అందియలు
ఘల్లు ఘల్లుమంటుంటే
చేతికున్న గాజులు
గలగల అంటుంటాయి!
నునుపెక్కిన బుగ్గలు
ఎరుపెక్కుతుంటే
కందిపోయిన బుగ్గలు
సిగ్గుపడుతుంటాయి!
పెదవుల మీది నవ్వులు
పువ్వులవుతుంటే
నువ్వుల పువ్వులు
రువ్వుతుంటాయి!
మాటల ఆణిముత్యాలు
పాటలవుతుంటే
ప ద ని స లు సంగీతమై
పాటల కచేరి చేస్తుంటాయి!
తుమ్మెదలాంటి కురులు
గాలికి ఎగురుతుంటే
పసందుగా నుదుటిని
ముద్దాడుతాయి!
కాటుక కళ్ళు తుంటరిగా
నవ్వుతుంటే
కవ్వించే కళ్ళు కన్ను
గీటుతుంటాయి!
నుదుటి మీదున్న
బొట్టు మెరుస్తుంటే
నింగిలోని నక్షత్రాలు
నేల రాలుతాయి!
వంపులు తిరిగిన నడుము
వయ్యారంగా ఊగుతుంటే
కల హంసలు నాట్యం
చేస్తుంటాయి!
పట్టు పరికిని తొడిగిన
ఎంకి అందాలు
జాలువారినా నండూరి
కుంచె అద్భుతాలు!
మనుసు దోచే
సప్త వర్ణ చిత్రాలు
తలమానికమైన చిత్ర కళకే
అభివాదాలు!!
- ఎస్.జవేరియా
9849931255