Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదుగదుగో కాలవనం
పరిమళింప చేస్తున్నది
నవ చైతన్య క్రాంతి దనం!
తరలిపోతున్నవి
నిన్న ఆఘ్రాణించిన
సుమ సుగందాలు!
పూల నిండా పుప్పొడులు
రేపటి వికసించే మొగ్గల నిండా
వెదజల్లే నవ పరిమళాలు !
జీవితం కష్టసుఖాల
పూల గుచ్చం!
ఎన్నో రంగుల మేళవింపు!
వికసించే నవ్వుల వదనాలు
మమకారాల మేటి సదనాలు
స్వర్గ సౌఖ్యాల దివ్య భువనాలు
పరిణామాల జీవదనాలు!
జీవితం
పరిమళాల పూ దోటలో
అనుభూతి సొగసుల గుబాలింపు!
కాలవనంలో
విరబూసిన నవ్వే పువ్వు!
- పి.బక్కారెడ్డి, 9705315250