Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జగదేవపూర్
జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో బుధవా రం ఉచిత పశు వైద్య శిబిరం మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రచమల్ల ఉపేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ యద లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నిర్వహించినట్లు మండల పశువైద్య అధికారి డాక్టర్ శ్వేత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మండల ఎంపిపి బాలేశం గౌడ్ హాజరయ్యారు. 70 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం, మండల కో-ఆప్షన్ సభ్యులు ఎక్బాల్,జగదేవపూర్ ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ జూపల్లి భాస్కర్, కృష్ణమూర్తి, సుధాకర్ రెడ్డి, బొల్లు పెద్దలు, భాగ్యరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సతీష్, ఇరమైన మైసయ్య, బాలయ్య, హాస్పిటల్ సిబ్బంది శ్రీనివాస్, హరిప్రసాద్, మార్కెట్ కమిటీ సిబ్బంది ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.