Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమీన్పూర్
బీరంగూడలోని శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరిం చుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం ఎంతో సంతోష కరమని ఆలయ నిర్వాహకులు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు అదెల్లి రవీందర్ అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మూడ్రోజులపాటు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగక ండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామి వారి దర్శనం కలగడం సంతోషకరమన్నారు. మహాశివరాత్రి రెండో రోజు సందర్భంగా కళ్యాణ మహౌత్సవంలో పలువురు కుటుంబ సభ్యులు కళ్యాణం లో పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకి ంచారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తదనంతరం పలువురు ముఖ్య నాయకులను ఆదేల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, ఆదేల్లి రవీందర్ యువసేన సైన్యం, వివిధ కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.