Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
అందోల్ మండలానికి చెందిన 13 మంది లబ్ధిదా రులకు మొత్తం రూ.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను చల్లగా చూసే ప్రజా నాయకుడన్నారు. పేద ప్రజల కష్టాలు సీఎం కేసీఆర్ కు తెలిసినంతగా మరెవ్వవరికీ తెలియవని, అందుకే వారి సంక్షేమం కోసమే, ప్రతీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆj ున తెలిపారు. తమ వారి బాగు కోసం ఎంతో కష్టపడి వైద్య ఖర్చులు పెట్టుకున్న వారికి సీఎం కేసీఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తు అని కొనియాడారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మఠం బిక్షపతి, అందోల్ ఎంపీపీ జోగు బాలయ్య, వైస్ ఎంపీపీ పట్లోళ్ల మహేశ్వర్ రెడ్డి, జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్ల య్య, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షు లు లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామ గౌడ్, సర్పంచులు అనిల్ రెడ్డి, సంగమేష్, నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, పద్మనాభరెడ్డి, రాజు పాల్గొన్నారు.