Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా.రాజేశ్వరి ఆదేశ ాల మేరకు ప్రధానమంత్రి టి.బి ముక్త్ భారత్ కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గృహం వద్ద ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి టి.బి వ్యాధి గ్రస్తులను దత్తత తీసుకున్నారు. వారికి 6 నెలలు పోషకాహారం అందిస్తామని నిర్మల జయప్రకాశ్ రెడ్డి తెలిపారు. నిర్మల జయప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్టులు అందించినట్టు అరుణ తెలిపారు. అనంతరం నిర్మల జగా ్గరెడ్డి మాట్లాడుతూ.. క్షయ వ్యాధికి పట్ల భయప డాల్సిన అవసరం లేదన్నారు. సకాలంలో మందులు వాడడం వల్ల క్షయ వ్యాధి తగ్గిపోతుందన్నారు. పోషకాహారం ద్వారా కూ డా టి.బి తొందరగా నయం అవుతుందన్నారు. తదనం త రం అరుణ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ.. రెండు వారాల పా టు దగ్గుతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకూ డదన్నారు. దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో తెమడ పరీక్ష చేయించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా క్షయ వ్యాధిని 2025 నాటికి పూర్తిగా నిర్మించాలన్నారు. జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్వై జర్ విష్ణు వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తుల దత్తతకు జిల్లా లో దాత లు ముందుకు రావాలని కోరారు. ఇతర దాతలు ఎవరై నా కనీసం ఒక్క టి.బి వ్యాధి గ్రస్తున్ని దత్తత తీసుకోవాలన్నారు.