Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ఎత్తున యువత ర్యాలీలు
- పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
- పలుచోట్ల శివాజీ విగ్రహావిష్కరణలు
నవతెలంగాణ-జహీరాబాద్
జహీరాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శివాజీ అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ప్రజలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్ష ణాలు శివాజీని గొప్ప రాజుగా చేశాయన్నారు. మార్కెట్ కమి టీ మాజీ చైర్మెన్ గుండప్ప, మాజీ ఎంపీపీ విజరు కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మహంకల్ సుభాష్, నాయకులు అశోక్, ఉపేందర్, రవి, ఉత్సవ కమిటీ సభ్యులు వంశీగొడ్కే, మేఘనాథ్‌రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో భవాని మందిర్ నుండి జాతీయ రహదారి గుండా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్, వై నరోత్తం, లతోపాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ రఘు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణంలో సిద్దేశ్వరా లయం గుడి వద్ద జరిగిన శివ పార్వతి కళ్యాణ మహౌత్స వంలో పాల్గొన్నారు. అక్కడ మందిరంలో ఢిల్లీ వసంత్‌కు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
జోగిపేట : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సంద ర్భంగా జోగిపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. పట్టణంలోని ఫైర్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించనున్న శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి దేశభక్తి కలిగిన మహనీయుల బా టలో నడవాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మఠం బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఎంపీపీ రామ గౌడ్, మాజీ కౌన్సిలర్ గోపాల్ రావు, లక్ష్మణ్, పట్టణ బీఆర్ఎస్, బీజేపీ అధ్యక్షులు సార శ్రీధ ర్, సయ్యా సాయి తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం : రామచంద్రపురం డివిజన్ రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్, స్థానిక యువత కోరిక మేరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అనంతరం స్థానిక రామచంద్రపురం బజరంగ్ దళ్ సభ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. .వారితో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్, ఆదర్శ్ రెడ్డి, పరమేష్, కుమార్ గౌడ్, కారికే సత్యనా రాయణ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సదాశివాపేట : శివాజీ 393వ జయంతి వేడుకలను సదాశివపేటలో ఛత్రపతి శివాజీ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పిల్లోడి విశ్వనాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాషాయ ధ్వజం ఎగరవేసి ఈ వేడుకలను ప్రారంభించారు. పురపాలక సంఘం వైస్ చైర్మన్ చింత గోపాల్, బీజేపీ నాయ కులు ఓదెల మాణిక్ రావు, కలపల్లి శివరాజ్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు, తదితర ప్రాముకులు కార్య కమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. చత్రపతి శివాజీ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి పవన్ గౌడ్, కమిటీ సభ్యులు రచాన్న స్వామి, మాలి పటేల్ ప్రభు, పండురం గారెడ్డి, ఉల్లి గడ్ల నాగన్న, మహేష్ స్వామి, విశ్వనాధ్, ఆర్య పరమేశ్వర స్వామి, విలాస్ రావు, స్థలదాత ధనరాజ్ సార్, విశాల్, శరత్ గుప్తా, రజనీకాంత్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి : శివాజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి బైపాస్ హనుమాన్ టెంపుల్ నుంచి యువత భారీ ఎత్తున శోభయాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో డీసీసీబీ వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషిచేసిన సామ్రాట్ శివాజీ మహారాజ్ అని కొనియాడారు. యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ మహా రాజ్ అని అన్నారు. సీడీసీ చైర్మెన్ కాసాల బుచ్చి రెడ్డి, వైఎస్ఆర్సిపి గౌరీ రెడ్డి శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రేమానందం, జైపాల్ నాయక్, పల్పనూరు శేఖర్, పీఎంకె యువసేన సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు శివాజీ చౌక్ వద్ద ఫోరమ్ ఫోర్ బెటర్ సంగారెడ్డి నాయకులు శివాజీ మహా రాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లా డుతూ.. వివక్ష లేని పాలన కోసం కృషి చేసిన మహానీ యుడు అని కొనియాడారు. ఫోరమ్ ఉపా అధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహా కార్యదర్శి పాండు రంగం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్ 393వ జయంతి సందర్భంగా ఆదివారం హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వ ర్యంలో స్థానిక ఐబిలోని శావాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ.. శివాజీ చూపిన మార్గా న్ని ఎంచుకొని నేటి యువత సన్మార్గంలో నడవాలని యువ తకు పిలుపునిచ్చారు. సభ్యులు అఖిల్, రాథోడ్, శ్రీధర్, రాహుల్ పాటిల్, కిట్టు, శ్రీకాంత్, పృథ్వి, వినరు, వివేక్, సాయి, రఘు, భార్గవ్, చెన్న, మని,తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ : నేటి తరానికి చత్రపతి శివాజీ ఎంతో ఆదర్శమని.. ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరం ఎంతో ఉందని బీఆర్ఎస్ నాయకులు తుమ్మల రుష్వంత్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని శివాజీ యువసేన ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు సాయి బాబా గుడి నుండి శివాజీ మహారాజ్ శోభయాత్రను శివాజీ పటంతో ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు తుమ్మల రష్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి గొప్ప నాయక ులలో చత్రపతి శివాజీ గొప్ప నాయకులని వారి చరిత్రను చేపట్టిన పోరాటం నేటి తరానికి తెలియజేయవలసిన అవ సరం మనం దరిపై ఉందన్నారు. శివాజీ జయంతి సంద ర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని.. నేడు పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులకు, శివాజీ యువసేన సభ్యులకు రుశ్వంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
జిన్నారం : జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మ గూడ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశం గౌడ్, సర్పంచ్ అంతిరెడ్డిగారి లావ ణ్య శ్రీనివాస్ రెడ్డిలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాసాలు పరిపాలన దక్షత నేటి తరానికి ఆదర్శమని గుర్తు చేశారు. స్థానిక యువత అంతకుముందు పెద్దమ్మ గూడెం నుంచి జిన్నారం ప్రధాన వీధుల గుండా శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో దద్దరిల్లిలా భారీ ర్యాలీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉప సర్పంచ్ సంజీవ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, లింగం, ఛత్రపతి యూత్ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ దుబ్బాక మహేష్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కల్హేర్ : కిష్టపూర్ గ్రామంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొని.. చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం గ్రామస్తులు వారిని శాలువాలతో సన్మానించారు. మున్సిపాలిటీ కౌన్సిలర్ లు. మండలం నేత లు. నాయకులు, యువజన నేతలుతదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం : మండలంలో కేంద్రంలోని ఎస్బీఐ సిఎస్పి కార్యాలయంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. జాగృతి కన్వీ నర్ తెలుగు పాండు ముదిరాజ్, ప్యాలవ రం డిప్యూటీ సర్పం చ్ మాణిక్యం యాదవ్, దేవరంపల్లి డిప్యూటీ సర్పంచ్ శివశం కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు దిగంబర్, మానయ్య, మోషన్, దత్తు, పాండు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
పుల్కల్ : పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని శివంపేట నుండి సారా పల్లి గ్రామం వరకు శివాజీ మహారాజ్ భారీ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం చత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అలాగే పలు గ్రామాల్లో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు జరిపారు.
నారాయణఖేడ్ : ఖేడ్ మండలంలోని తుర్కపల్లిలో ఆదివారం శివాజీ జయంతి వేడుకలను గ్రామస్తులు, యువ కులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీమాత దేవాలయం నుం చి శోభాయాత్ర ప్రారంభించి శివాజీ చౌక్ వరకు ఆటపా టల తో.. యువకులు డ్యాన్సులు చేస్తూ అంగరంగ వైభంగా కొన సాగించారు. ఖేడ్ మండల యువజన కాంగ్రె స్ అధ్యక్షులు శివకుమార్, మాజీ ఎంపీటీసీ దత్త గౌడ్, రఘు నాథ్, అంజాగౌడ్, కృష్ణ నరేష్‌గౌడ్, పండరి, రాజశే ఖర్, నరేష్ గౌడ్, వెంకట్ రెడ్డి ,వెంకన్న, సాగర్, దామోదర్, నరసింహలక్ష్మీరెడ్డి, గ్యానుసాగర్, గోవిందు, తుకారం పాల్గొన్నారు.
మునిపల్లి : ఛత్రపతి శివరాజు జయంతి వేడుకలను ముని పల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మేళాసంఘం గ్రామ శివారులో గల అతి పెద్ద శివాజీ విగ్రహం వద్ద శివాజీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ నాగిశెట్టి,ప్రవీణ్, దుర్గాప్రసాద్, ప్రశాంత్.తదితరులు పాల్గొన్నారు.