Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హత్నూర
సంగారెడ్డి పట్టణంలో ఈనెల 26న దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ, కురుమ సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమం ఉన్నందున.. ఆదివారం మండల పరిధిలోని సిరిపురలో కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బురుగడ్డ పుష్ప నగేష్ హాజరై మాట్లాడారు. దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు, కురుమ సంఘ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి కురుమ సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి దాసు గారి కిష్టయ్య, సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా గొర్రె కాపుల సహకార సంఘం మాజీ డైరెక్టర్లు భూమయ్య, కృష్ణ, మణయ్య, మల్లేశం, రమేష్, హత్నూర మండల కురుమ సంఘం నాయకులు మల్లేశం, చంద్రయ్య, శ్రీశైలం, నర్సింలు, పాండు, హరిబాబు, మధు, సాయిలు, మహేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.