Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఝరాసంగం
జిల్లాలోని అతి పురాతనమైన శైవ క్షేత్రాల్లో ఒకటైన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి పురస్కరి ంచుకుని శనివారం అర్ధరాత్రి జాగరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనం తరం స్వామివారి పుష్కరిణి, అమృత గుండం లో జల లింగానికి పూజలు నిర్వహి ంచి గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి ఏకాదశ రుద్రా భిషేకం, మహా రుద్రాభిషేకం, మహా మంగళహారతి నిర్వహి ంచారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు, అధికారులు, వేద మంత్రోచ్ఛనల మధ్య పూలమాల, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మొగుడంపల్లి జెడ్పీటీసీ సభ్యు లు అరుణామోహన్రెడ్డి, స్థానిక డిప్యూటీ తహసిల్దార్ రాజిరెడ్డి, ఆర్ఐ రామారావు, నామ రవి కిరణ్ తదితరులు ఉన్నారు.