Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్హేర్
నిజాంపేట, కల్హేర్ మండల పరిధిలోని రాంరెడ్డిపేటలో గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం జెడ్పీటీసీ నరసింహరెడ్డి ప్రారంభించారు. క్యాంపు శిబిరాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించి అయ్యర్ మెషిన్ తో ఇంటి పరీక్షలు నిర్వహించే విధానాన్ని పరిశీలించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వారి కంటి సామర్థ్యాన్ని బట్టి కళ్లద్దాలను అందించారు. 18 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్ దుర్గవ్వ, ఎంపీవో శ్రీనివాస్, కంటి వెలుగు టీం మెడికల్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్, సిహెచ్ఓ ఏక్ నాథం, మండల హెల్త్ సూపర్వైజర్ మాణిక్యం, కల్హేర్ నిజాంపేట్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్, పార్టీ కల్హేర్ మండల ఉపాధ్యక్షుడు ఎన్.యాకోబ్ తదితరులు పాల్గొన్నారు.