Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
- ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
- చిట్కుల్లో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-పటాన్చెరు
దేశంలోనే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అనా ్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నీలం మధు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి సంబురాలు జరిపారు. అనంతరం ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మధు మాట్లాడుతూ.. దేశ్ కీ నేతగా దేశ రాజకీ యాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాj ుకుడు కేసీఆర్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతుభీమా, రైతుబంధు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 24 గంటలు కరెంట్ వంటి పథకాలు దేశంలో అమలయ్యేలా చూస్తున్న గొప్ప నాయకుడన్నారు. కాళేశ్వరం నీటితో వందల ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి అన్నారు. దేశానికి ఏం చేస్తారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కష్టాలు కోర్చి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. ఈసారి కూడా తెలం గాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ను ఆశీర్వది స్తారని ఆయన తెలిపారు. పొట్టి నారాయణ రెడ్డి, సిహెచ్ వెంకటేష్, మురళీ, రాజ్ కుమార్, వెంకటేశ్, ఎండీ ఖదీర్, గారెల మల్లేష్, నారబోయిన శీను, సత్య నారాయణ, మన్నే రాములు,గోపాల్, మహేష్, భాస్కర్, శ్రీనివాస్ ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.