Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
కేసీఆర్ ఈ మట్టి బిడ్డ కావడం మనకు గర్వకారణమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కారణజ న్ముడిగా, చిరస్మరణీయుడుగా, ప్రజల తల రాతలు మార్చే మహానీయుడుగా, మహా నాయకునిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు, ఉద్యమ కారుల మధ్య నేడు జన్మదిన వేడుకలు నివహిస్తున్నా మన్నారు. కానే కాదు, రానే రాదు అన్న తెలంగణా రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి చూయించాడన్నారు. రైతు బందు, బీమా పథకాలు దేశానికి ఆదర్శమని, తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం తో బ్రతికేలా కెసిఆర్ కృషి చేశాడన్నారు. రూ.65వేల కోట్లు రైతుబందు కోసం బడ్జెట్ లో కేటాయిం పులు చేశారని, అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణను కేసీ ఆర్ ముందుచాడన్నారు. రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం కేసీఆ ర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, నాయకులు సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో మొక్కలను నాటారు. మున్సిపల్ చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్రరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, జంగిటి కనకరాజు, గుండ్ల యోగి, సత్తయ్య, బందా రం రాజు, ఎల్లం, శ్రీను, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.