Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పటాన్చెరు-సంగారెడ్డి వరకు సీపీఐ(ఎం) పాదయాత్ర
- బడ్జెట్లో నిధులు కేటాయించాలని పలుమార్ల ఆందోళనలు
- ప్రజా ఉద్యమంగా మారుతోన్న మెట్రో డిమాండ్
- అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- మూడో దశలో మియాపూర్-సదాశివపేటకు నిధులొచ్చేనా
- విస్తరించిన విద్యా సంస్థలు, కంపెనీలు, పుణ్యక్షేత్రాలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
హైదరాబాద్ మహానగర విస్తరణ సంగారెడ్డి పట్టణాన్ని తాకింది. హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారి 65, కంది-నాందేడ్ రహదారులుండడంతో ఐఐటీ హైదరాబాద్, సంయుక్త వంటి ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు, సాప్ట్వేర్, ప్యానిప్యాక్చరింగ్ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు, పరిశో ధనా కేంద్రాలు, గ్రేటర్ కాలనీలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు విస్తరించాయి. మియాపూర్ నుంచి సంగారెడ్డి ఎక్స్ రోడ్డు వరకు హైదరాబాద్‌లో అంతర్ భాగం గా మారింది. రోడ్లన్నీ రద్దీగా మారడంతో గంటల సమయం రవాణాకే పోతుంది. మియాపూర్ నుంచి సంగారెడ్డి ఎక్స్ రోడ్ మీదుగా సదాశివపేట వరకు మెట్రో లైన్ విస్తరిం చాలనే డిమాండ్ ప్రజల్లో బలంగా ఉంది. ప్రజల పక్షాన మెట్రో విస్తరణ కోసం సీపీఐ(ఎం) పాదయాత్ర చేయడం, బడ్జెట్ సందర్భంగా ఆందోళనలు చేయడంతో ఎమ్మెల్యే జగా ్గరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. మెట్రో లైన్ విస్తరణ డిమాండ్ ప్రజా ఉద్యమంగా మారనుంది.
మియాపూర్ నుంచి సదాశివపేట వరకు మెట్రోలైన్ విస్తరించి రైళ్లు నడపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతు న్నారు. మియాపూర్, ఆల్విన్ ఎక్స్‌రోడ్డు, చందానగర్, లింగం పల్లి(బీహెచ్ఈఎల్), బీరంగూడ, పటాన్చెరు, ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం, లక్డారం, గణేష్‌గడ్డ, కంది, సంగారెడ్డి ఎక్స్‌రోడ్డు, మల్కాపూర్, పెద్దాపూర్, నందికంది, సదాశి వపేట వరకు 48 కిలో మీటర్లు మెట్రోలైన్ విస్తరించాలని ప్రజల కోరుతున్నారు. 48 కిలో మీటర్ల మేర మెట్రో రైళ్లు నడిపితే రవాణా సదుపాయం మెరుగుపడుతుందని స్థాని కులు అభిప్రాయపడుతున్నారు. లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు అనేక విద్యా సంస్థలు, కంపెనీలు, ఆఫీసు లు, అపార్ట్మెంట్స్, కాలనీలు, వాణిజ్య సముదాయాలు విస్తరించాయి. అంతర్జాతీయ విద్యా సంస్థ అయిన ఐఐటీ హైదరాబాద్ కంది సమీపంలో ఉంది. విదేశాలతో పాటు దేశ వ్యాప్తంగా వచ్చిన విద్యార్థులు ఐఐటీలో చదువుతు న్నారు. సయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ నడుస్తుంది. ఇక్రిషాట్ లాంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల, జేఎన్టీయూ విద్యా సంస్థ ఉంది. అంతర్జాతీయంగా పేరున్న తోషిభా కంపెనీతో పాటు శాండ్విక్, అరవింద ఫార్మా కంపెనీలున్నాయి. పదుల సంఖ్యలో బీర్ల తయారీ కంపెనీలు, ఫార్మా, కెమికల్ ప్యాక్టరీలున్నాయి. వేలాది మంది ఉద్యోగులు, కార్మికులతో పాటు విద్యార్థులు నిత్యం హైదర ాబాద్ నుంచి సంగారెడ్డి వరకు ప్రయాణిస్తున్నారు. గణేష్ గడ్డలో దేవాలయం, ఏకశిల శనేశ్వరం విగ్రహాం, వైకుంఠ పురం దేవాలయం, పసల్వాదీలో ఉన్న మహా ప్రాశస్య వంటి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం నిత్యం వేలాది మంది వస్తుపోతున్నారు. హైదరాబాద్-ముంబయి జాతీయ రహ దారి, కంది-నాందేడ్ ప్రధాన రహదారి విస్తరించి ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిత్యం హైదర ాబాద్కు వేలాది బస్సులు, కార్లు, లారీలు ఇతర వాహనాలు నడుస్తున్నాయి. ముంబయి హైవే నిత్యం రద్దీగా ఉండడంతో బస్సుల్లో ప్రయాణం కోసం గంటల సమయం పడుతోంది. విద్యార్థులు, ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు రోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఎన్ని నడిచినా ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ట్రాఫిక్ జామ్‌తో గంటల సమయం పడుతోంది.మెట్రోలైన్ విస్తరించి రైళ్లు నడిపితే లక్షలాది మందికి ప్రయాణాలు సులభతరం అవుతాయని వివిద రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
మెట్రోలైన్ విస్తరణ కోసం సీపీఐ(ఎం) ఉద్యమం
సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం మియాపూర్ నుంచి సదాశివపేట వరకు మెట్రో లైన్ విస్తరించి రైళ్లు నడపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పటాన్చెరు నుంచి సంగారెడ్డి వరకు పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ(ఎం) చేసిన పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన లభించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన వివిద వర్గాల ప్రజలు పాదయాత్రను స్వాగతించారు. మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించాలని కోరుతూ పలుమార్లు ప్రజా ప్రతిని ధులు, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలిచ్చారు. బడ్జెట్ సంద ర్భంగా నిధులివ్వాలని ఆందోళనలు చేశారు. సీపీఐ(ఎం) చేసిన పాదయాత్ర, వినతులు, ఆందోళన ప్రభావంతో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మెట్రో విస్తరణ గురించి మాట్లాడ ాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగ్గారెడ్డి మియాపూర్-సదాశివపేట వరకు మెట్రో లైన్ విస్తరించాలని ప్రస్తావించారు. నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ(ఎం) పాదయాత్ర, ఆందోళనలు, వినతుల ప్రభావంతో ఎమ్మెల్యే పలుమార్లు మెట్రో విస్తరణ గురించి మాట్లాడడమే కాకుండా ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మెట్రో లైన్ విస్తరణ కోసం ఆందోళనలు చేయాలని బావిస్తున్నారు. ప్రజలు కూడా తమ వంతుగా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఏదో రూపంలో మెట్రో విస్తరణ కోసం కదిలే అవకాశంలేకపోలేదు.
మెట్రో విస్తరణకు నిధులివ్వాలి..
మియాపూర్-సదాశివపేట వరకు మెట్రో లైన్ విస్తరించేందుకు నిధుల్ని మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాం. పటాన్ చెరు నుంచి సంగారెడ్డి వరకు పాదయాత్ర చేశాం. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే సందర్భంగా నిధు లు కేటాయించాలని ఆందోళన చేశాం. కలెక్టర్, ప్రజాప్రతి నిధులకు వినతులిచ్చాం. మెట్రో రైళ్లు నడపాల్సిన అవసర ముంది. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెం దింది. ఐఐటీ, ఇక్రీషాట్, జేఎన్టీయూ, మెడికల్ కళా శాల లు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కంపెనీలెన్నో ఉన్నాయి. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు సదాశివపేట వరకు మెట్రో విస్తరణ కోసం నిధులివ్వాలని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.
- గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంగారెడ్డి