Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
కుల, మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. ఆయన దేశ ప్రధాని అయి ప్రజలందరికీ సేవలందించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మండలంలోని రాంపూర్ శ్రీ మదనానంద శారదా క్షేత్రంలో సీఎం ఆయు ఆరోగ్యాలతో కల కాలం చల్లగా ఉండాలని కోరుకున్నారు. ప్రధాని కావాలంటూ ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తొగుట కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థు లతో కలిసి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు జన్మది నోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థిను లకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమల కొమురయ్య,వైస్ చైర్మన్ కంది రాం రెడ్డి,పిఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, సర్పం చుల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి,కో అప్షన్ సభ్యులు ఎండి కలీమోద్దీన్, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, కొమ్ము శరత్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.