Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన వద్దు అండగా ఉంటా మంత్రి హరీశ్ రావు
నవ తెలంగాణ - సిద్దిపేట
చిన్నకోడూరు మండలం లోని రామునిపట్ల వద్ద పెద్దకోడూర్కు చెందిన విద్యార్థులు బుధవారం ఆ టోలో ఇబ్రహీంనగర్ మో డల్ స్కూల్‌కు వెళ్తుండగా... వెనుక నుంచి వచ్చిన కారు ఢకొీట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట వైద్య కళాశాల లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే సిటీ స్కాన్, ఎక్స్ రే తీయాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైద్యులను ఆదేశించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన అష్టావధాని, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక సాహిత్యవేత్త, అనంతసాగర్ శ్రీ సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ కుటుంబాన్ని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు రాధాకృష్ణ శర్మ, సాయిరాం, మాణిక్య రెడ్డి పాల్గొన్నారు.