Authorization
Wed December 04, 2024 11:10:41 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
పేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతూ వారి ఉన్నత చదు వుకు సహకరించాలని వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు వజి నపెళ్లి అనిల్, దీప అన్నారు సోమ వారం మండలంలోని గుర్తురు మోడల్ స్కూల్లో120 మంది విద్యార్థులకు పరీక్ష ఫ్యాడులు పంపిణీ చేశారు.జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జామె ట్రిక్ బాక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మో త్కూరి రవీంద్ర చారి మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ఫ్యాడుల పంపిణీ చేయడం అభినందనీయమని, ఇకముందు కూడా విద్యార్థులకు అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి చిదిరాల నవీన్, బిజ్జాల అనిల్, పిల్లల మర్రి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.