Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
లోక్‌సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అనర్హత.. సభలో అదానీపై చర్చను నివారించేందుకేనని టీపిసిసి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజ కర్గ ఇన్చార్జీ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి వైఖరి దుర్మార్గమని అన్నారు. కోర్టు అప్పీలుకు 30 రోజుల సమయం కూడా ఇచ్చినప్పటికీ, అనర్హత వేటు వేయడం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చే పట్టిన భారత్ జోడో పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారని, వాటిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపో తున్నారని అన్నారు. ఏప్రిల్ 16, 2019న బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ రాహుల్ గాంధీపై కేసు పెట్టారని, అప్పుడు పూర్ణేష్ కేసును పరిశీలించిన అప్పటి సూరత్ కోర్ట్ అత నిపై మొట్టికాయలు వేయడంతో పూర్ణేశ్ సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగని వ్వకుండా గుజరాత్ హైకోర్ట్ నుండి స్టే తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 7, 2023న రాహుల్ గాంధీ లోక్‌సభలో అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని తీవ్రస్వరంతో ప్రశ్నించా రన్నారు. ఇందులో ముఖ్యంగా సూరత్ చీఫ్ జ్యూడిషి యల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయి, కొత్త జడ్జీ నియమితులైన తరువాత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసిన వ్యక్తే హైకోర్టుకు వెళ్ళి విచారణపై స్టే వెకెట్ చేయించుకున్నారని అన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో అదానీ, మోదీ మధ్య సంబంధాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించిన తర్వాత పూర్ణేశ్ మోదీ తిరిగి రంగప్ర వేశం చేశారు. ఆగమేఘాల మీద గుజరాత్ హైకోర్టులోని తన స్టే అభ్యర్థనను ఫిబ్రవరి 16న ఉపసంహరించుకు న్నారని అన్నారు. హైకోర్టులో స్టే ఉపసంహరించుకున్న 11 రోజులలోనే అనగా, ఫిబ్రవరి 27న కోర్టులో విచా రణలు తిరిగి ప్రారంభమయ్యాయని అన్నారు. 25 రోజులలో మార్చి 23న కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ళ జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇప్పటిదాకా పరువు నష్టం కేసులో ఇప్పటివరకు ఎవరికి శిక్ష పడలేదని గుర్తు చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీని నివారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ఉడుత మహేందర్, ముఖ్య నాయకులు పిప్పాల రాజేందర్, తోట రంజిత్, హాఫిజ్, నగునూరి రజినీ కాంత్, కేతిరి సుభాష్, కిషోర్ రెడ్డి, గురిజాల రవి, తదితరులు పాల్గొన్నారు.