Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
వారమంతా విధి నిర్వహణలో బిజీగా గడిపే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ఆదివారం సెలవు రోజున కైకిలికిపోయి మిరుప తోటలో కూలీలతో కలిసి మిర్చి కోశారు. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి జయలక్ష్మి - వెంకటస్వామిరెడ్డి దంపతుల మిరుప తోటలో కూలీలతో మమేకమై ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1 గంటలకు వరకు మిర్చి కోశారు. మహిళలతో కలిసి అన్నం తిన్నారు. పని చేసినందుకు గాను 200 రూపాయలకు కూలీగా తీసుకున్నారు. ఆ డబ్బులను ఓ పేద మహిళ కూలీకి తస్లీమా అందించారు. వ్యవసాయ పనులు చేయడం తనకు ఇష్టమని, రైతుల గడపడం గొప్పవరమని తస్లీమా అన్నారు. యువకులు ఖాళీ సమయాల్లో కాలాన్ని వృథా చేయకుండా వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు సహకరించాలని తస్లీమా కోరారు.