Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
బల్దియా, అన్నపూర్ణ సేవాదళ్ సంయుక్త ఆధ్వర్యంలో బలియా ప్రధాన కార్యా లయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర మేయర్ గుండు సుధా రాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజల దహార్దిని తీర్చడానికి బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 108 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, నగర వ్యాప్తంగా జన సంచారం ఉండే ప్రధాన కూడళ్లలో స్థానిక కార్పొరేటర్ ల సహకారంతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని మేయర్ తెలిపారు. ఆన్న దానసేవా కార్యక్రమంతోపాటు చలివేంద్రం ఏర్పాటులో ముఖ్య భూమిక వ హిం చిన సిబ్బందిని మేయర్ అభినం దించారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కార్పొరే టర్ విజయలక్ష్మి సురేందర్, అదనపు కమీషనర్ రవీందర్, సెక్రెటరీ విజయలక్ష్మి, అన్నపూర్ణ సేవాదళ్ వ్యవస్థాపకుడు బాకం సంతోష్ కుమార్, సభ్యులు బుర్ర. మహేష్, గౌరీ శంకర్, ధర్మరాజు, మియాపురం శ్రీకాంత చారీ, రాజారపు భాస్కర్, గోల్కొండ శ్రీను, సత్యనారా యణ, రమాదేవి, రజిత, సతీష్, బండారు రవి, సుదర్శన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.