Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
తామపంటపొలాల్లో నుంచి రంగ య్య చెరువు కాల్వ తీయవద్దు అంటూ క న్నారావుపేట రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవోకార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నల్లబెల్లి మండలం క న్నారావుపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని రై తులు మాట్లాడుతూ రంగయ చెరువు రిజ ర్వాయర్ ఉపకాలువ కన్నారావుపేట నుండి రామతీర్థం గ్రామం వరకు నిర్మాణం చేపట్టాలని అధికారులు సర్వే చేపట్టార ని తెలిపారు. ఈ కాల్వ తీ యడం వల్ల ఈ ప్రాంత రై తులకు ఏమాత్రం ఉపయో గకరంగా ఉండదని పైగా నష్టపోయే ప్రమాదం ఉం దని రైతులు వాపోయారు. ఇంతకు ముందు ఆర్డీవో కు కె నాల్ నిర్మాణాన్ని ఆపాలం టూ విన్నవించగా పనులను నిలిపి వేశారని గుర్తు చేశారు. కన్నరావుపేటలో రంగాయ చెరువు రిజర్వాయర్ ఉపకాల్వ కెనాల్ పోవు మార్గంలో ఉన్న భూములు అన్ని ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలు కాలేదని తద్వారా సమస్యలు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యేను సంప్రదించగా కెనాల్ వద్దని ఎమ్మెల్యే కూడా సిఫార్సు చేశారని తెలిపారు. ఏడాది తిరిగి అధికారులు సర్వే చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోరైతులు బోద్దిరెడ్డి ప్రతాపరె డ్డి, సంపత్‌రెడ్డి, దేవేందర్, సనుప బద్రి, ఆయిల్ రెడ్డి, కాశిడి మల్లారెడ్డి, పల్నాటి రమేష్, ఆ శోద శరత్, నిరం జన్రెడ్డి, వర్ధన్ పాల్గొన్నారు.