Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
ఆటోలలో పరిమితికి మించి కూలీలను తీసుకొని వెళ్లొద్దని ఆటో డ్రైవర్లను వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోని అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొని తిరిగి వస్తుండగా సోమవారం మండల పరిధిలో పరిమితికి మించి కూలీలతో వెళ్తున్న ఆటోలను జడ్పీ చైర్ పర్సన్ జ్యోతి ఆపి డ్రైవర్లను మందలించారు. ఇటీవలనే పత్తిపాక గ్రామానికి చెం దిన కూలీలు ఆటోలో వెళుతూ ప్రమాదానికి గురి కావడంతో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారని, ఆ ఘటన మరువకముందే 20 మంది కూలీలతో ఎలా ప్ర యాణం చేస్తున్నారని కూలీలను కూడా ప్రశ్నించారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలను కొన్ని తెచ్చుకోవద్దని, గ్రామాల్లో నే వ్యవసాయ పనులు చేయాలని కూలీలకు సూచించారు. జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే కుటుంబం పెద్దదిక్కుని కోల్పోయి, పిల్లల జీవితాలు దీనస్థితిలో పడతాయని కూలీలకు తెలియజేశారు. గ్రామాలలో ఉపాధి పనులు కూడా చేపడుతున్నారని, ఉపాధి పనులకు వెళ్లాలని కూలీలకు ఆమె సూచించారు.