Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కేంద్ర ప్రభుత్వపు రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టెందుకు ఐక్యంగా పోరాడుదామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మాలోతు సాగర్ అన్నారు. అఖిలభారత సంఘాలలో పిలుపులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమనికి బయలు దేరిన కార్యకర్తలకు సీఐటీయూ రంగసాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి కాని పాక ఓదేలు అధ్యక్షతన సోమవారం సంఘీభావాన్ని తెలియజేశారు ఈ కార్యక్ర మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాగర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున ఏప్రిల్ 5న జిల్లా సీఐటీయూ నాయకత్వం బయల్దేరి ఛలో ఢిల్లీ కి వెళ్తుందని రంగశాయిపేట ఏరియా కమిటి నుండి కూడా అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోవచ్చిన నాటి నుండి కా ర్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు పని భద్రత కనీస వేతనం ఈఎస్ ఐ,పీఎఫ్ సౌకర్యాలు లేకుండాకార్మిక హక్కల కోసం పోరాటాలు చేయకుండా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడిందని 130 ఏళ్లక్రితం పోరాడి సాధించుకున్న ప్రాణ త్యాగాలు చేసి హక్కులు సాధించుకుంటే నాలుగు లేబర్ కో డ్లును తీసుకొచ్చి యజమానులకు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తుల కోసం అ నుకూలంగా చట్టాలను తీసుకొచ్చి యావత్ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కార్మికుల పట్ల బీజేపీ అవలం భిస్తున్న ప్రతి విధానాన్ని తిప్పి కొట్టడమే సీఐటీయూ ఎజెండా అని అన్నారు కార్మి కుల జీవితాలలో చీకటి రోజులు పోయి వెలుగు నింపేవరకు సీఐటీయూ పోరా డుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కో-కన్వీనర్స్ సింగారపు దాసు , లక్క రమేష్, ఏరియా కమిటి సభ్యులు మాలోతు ప్రత్యుష, జ్యోతి, రత్నం, డివై ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, గజ్జచందు, మొగుళ్ళ అనిల్, పొన్నం బాబురావు, కందగట్ల రఘుపతి, శివ, సింగారపు ప్రకాష్, గణేష్, గోళ్లేన సంపత్, ముఖేష్, తుల్లా బాబు, గుర్రం వెంకటేష్, రాజరాపు పెద్దరాజు, కందగట్ల స్వప్న, కలకొట్ల బిక్షపతి కూన రాధికా నిమ్మల లావణ్య సోషల్ మీడియా ఉపాధ్యక్షులు ఇసంపెల్లి సతీష్, పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు దసారపుఅనిల్, శ్రీనివాస్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.