Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
ప్రజావాణి సమస్యలు సత్వ రమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారుల కు ఆదేశాలు ఇచ్చారు. వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్ర మానికి వచ్చిన వినతులను వరం గల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు. ఓరుగల్లు ఆటోడ్రైవర్స్ యూనియన్ ఆ ధ్వర్యంలో కలెక్టర్కు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఓరు గల్లు ఆటో డ్రైవర్స్ యూనియన్ వరంగల్ రైల్వే స్టేషన్ ఆటో కార్మికులకు 2009 లో దుపకుంటలో అప్పటి ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తే కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి పిల్లర్లు వేసుకున్నాము ప్రస్తుతం డబల్ బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తామని తమ భూములను ప్రభుత్వం తీసుకున్నది. డబుల్ బెడ్ రూములు ఇచ్చే విషయంలో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని యూనియన్ నాయకులు వినతి పత్రం అం దజేశారు. వరంగల్ జిల్లా ఒంగురు దేవేందర్ రాయపర్తి మండలంలో కొండూరు గ్రామ శివారు లో ఉన్న సర్వే నంబర్ 192/2 లో ఎకరం భూమిని తన అన్న పే రు మీద పట్టా చేసుకున్నాడని తెలిసిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారుల ను సంప్రదించినా ఫలితం లేదని,కనీసం మీరైనా తన పేరు మీద పట్టా చేయాల ని కలెక్టర్కు ఒంగురు దేవేందర్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అద నపు కలెక్టర్ శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, ఆర్డిఓ మహేందర్జీ పాల్గొన్నారు.