Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నవతెలంగాణ-సుబేదారి
సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొము రయ్య అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నా యక్ అన్నారు. సోమవారం కలెక్టర్ ప్రాంగణం లో అధికారికంగా జరిగిన దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు కలెక్టర్ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులు గా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్‌లు హాజరై మాట్లాడుతూ మా నవ విమోచనపోరాటాల్లో భూమిని పోరాట ఎజెం డాగా మార్చినఘనత దొడ్డి కొమురయ్యకు చెందు తుందన్నారు. చరిత్రను అధ్యయనం చేసిన వారు తె లుసుకున్న వారు నూతన నవయుగాన్ని నిర్మిస్తారు. ఈ వెలుగులో తెలంగాణ వైతాళికులు అమరుల చరి త్రలను వెలికితీసి వారి ఆశయాలను ఆచరణలో పె డుతున్న మహావ్యక్తి కేసీర్ అని అన్నారు. కుడా చైర్మ న్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ భారత దేశంలో విలీనం కావడానికి, భూసం స్కర ణలు పాలకు లు చేపట్ట డానికి కొమురయ్య అమ రత్వం తర్వాత వెల్లువెత్తిన ఉద్యమాల పరంపరలో గొప్ప ముందడుగు తెలంగా ణ రాష్ట్రసాకారం అనే తాత్వికతను కేసీర్ కలిగి ఉ న్నందునే కొమురయ్య జయంతిని అధికార కార్యక్ర మంగా ప్రకటించారన్నా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చి న్న వయసులోనే వెట్టిచాకిరికి, బలవంతపు లేవి ధా న్యం సేకరణకు వ్యతి రేకంగా తొలి తిరుగుబాటు బా వుటా ఎగురవేసి ఆధునిక సామాజిక పోరాటాలకు మార్గదర్శి అయ్యాడన్నారు. ప్రవహించే ఉత్తేజంలా నూతన తరాలకు ప్రేరణ ఇస్తూ కొమురయ్య చిరస్మ రణీయుడుగా మారా డన్నారు. టీజీవో నేత ఎన్న మనేని జగన్మోహన్రావు, దొడ్డి కొమురయ్య ఫౌండే షన్ అధ్యక్షుడు అస్నాల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కొమురయ్య త్యాగంతో జరిగి న పోరాటాల వల్ల సా గుభూములు వికేంద్రీకరణ జరిగిందన్నారు .ఇప్పుడు ఆ భూములను సాగునీరు కల్పించి ఆకుపచ్చ ద్వీ పం గా కేసీర్ మార్చారన్నారు. పాలనలో మట్టి మనుషు ల భాగస్వామ్యం కోసం,సాంఘిక ఆర్ధిక రాజకీయ వి ప్లవాలను ఏకకాలంలో జరిగిన మాహా విప్లవం తె లంగాణ రైతాంగ సాయుధ పోరాటమని అన్నారు. దీనికి కొమురయ్య పోరాటము, అమరత్వం వలన ఆ నిప్పురవ్వలు దేశమంతా దావానలంలా వ్యాప్తి చెందాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా దొడ్డి కొముర య్య చిత్ర పటానికి అతిధులు పూల నివాళి అర్పించా రు. రెండు దశాబ్దాలుగా కొమురయ్య అమరత్వ నేప థ్యం తదనంతర చరిత్ర ను ప్రజావాహినిలో సజీవం గా ఉండడానికి కషి చేసిన అస్నాల శ్రీనివాస్ ను, కొ మురయ్య ఊహా చిత్రాన్ని వేసిన మల్లిక్‌ను కలెక్టర్ ఘనంగా సత్కారించారు.
ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు వన్నా ల శ్రీరాములు, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈవో వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఏ. పిడి శ్రీని వాస్, డీపీఓ జగదీశ్వర్, సిపిఓ సత్యనారాయణరెడ్డి, డీఎం డబ్ల్యూవో మేనశ్రీను, టీజీవో కార్యదర్శి కిరణ్ కుమా ర్, ప్రవీణ్ రాజేష్, బీసీ సంఘం నాయకులు శ్యామ్ యాదవ్, పులి శ్రీనివాస్, చిన్నాల యశ్వంత్, కుర్మసం ఘం నేత కంచు ప్రభాకర్,ఇతర గొల్ల, కుర్మా నాయ కులు, అధికారులు పాల్గొన్నారు.