Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజులుగా వృద్ధులు, వికలాంగుల నిరీక్షణ
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్ప డం లేదు. మండలంలోని మడిపల్లి గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద నాలుగు రోజులుగా మండుటెండలో వృద్ధు లు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక లోపాల కారణం గా పింఛన్ల పంపిణీ నిలిపివేయడంతో వృద్ధులు రోజు మధ్యాహ్నం వరకు మండు టెండలో వేచి ఉండి నిరాశ తో వెనుదిరుగుతున్నారు. ఎండ వేడి తాళలేక పోస్ట్ ఆపీ స్ ఎదుట కార్డులు వరుసలో పెట్టి తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ప్రతినెలా ఆలస్యంగా పింఛన్లు ఇ స్తుండడంతో లబ్ధిదారులు అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నారు.ఉదయం కొంతమంది భోజ నం చేయకుండా పోస్ట్ ఆఫీస్ వద్దకు వచ్చి మధ్యాహ్నం వరకు అర్ధాకలితో అలమటిస్తున్నారు.నాలుగు రోజులుగా పింఛన్ల కోసం తిరుగు తున్న సర్వర్ మొరాయింపుతో డబ్బులు తీసుకోలేకపోతున్నామని వాపోతున్నా రు.సాంకేతిక సమస్యలతోనే పింఛన్లు పంపిణీలో ఆలస్యం అవుతుందని పోస్ట్ సిబ్బంది పేర్కొంటున్నారు. సోమవరపుకుంటతండా గ్రామం నుంచి సుమారు 110 మందికి పైగా వృద్ధులు,వితంతువులు,వికలాంగులు,ఒంటరి మహిళలు పిం ఛన్ల కోసం తండా నుండి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి పింఛన్లు తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు ఆటోకు రాను పోను చార్జీ రూ.150 నుండి 200 రూపాయలు చెల్లించి పింఛన్ల కోసం మడిపల్లి గ్రామంలో ఉన్న పోస్ట్ఆఫీస్ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నేలకొందని వృద్ధులు వాపో తున్నారు. నూతనంగా ఏర్పడిన సోమవరపుకుంట తండా గ్రామపంచాయతీ భవ నంలో పింఛన్లు ఇచ్చే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని తండావా సులు కోరుతున్నారు.ఈ సమస్యల పరిష్కారానికి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్ మొత్తాలు వేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.