Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ పసునూరి దయాకర్, ఇంచార్జ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-జఫర్గడ్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగా ణపై వివక్షత చూపుతుందని ఎంపీ పసునూరి దయాకర్, ఇన్చార్జ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి పేర్కొన్నారు. మండలం లోని కూనూర్ గ్రామంలో సోమవారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే ళనం మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి ఏర్పాటు చేయడం జరి గింది. మండలంలోని ఉప్పుగల్లు గ్రామం నుండి కోనూరు గ్రామం వరకు బైక్ర్యా లీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ దయాకర్, ఇంచార్జ్ ఎమ్మెల్సీ కోటి రెడ్డి హాజరై మాట్లాడుతూ కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ, కలిసి కట్టుగా బీఆర్ఎస్ను కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్ర మంలో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాకాల సంపత్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్, జెడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గుజ్జారి రాజు, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ కడారి శంకర్, సర్పంచ్ ఇల్లందుల కుమార్, సర్పం చులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనానికి కడియం వర్గం దూరం హాజరు కాని సర్పంచ్
మండలంలోని సోమవారం కూనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వర్గీయులు దూరం అయ్యారు. కెసిఆర్ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం పార్టీ కార్యకర్తలు అందరూ మన స్పర్ధలు లేకుండా అందరూ ఒక దగ్గర కలిసి ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో 10 గ్రామాలలో కడియం వర్గీయులు పాల్గొనలేదు.10గ్రామ పంచాయతీలలో సర్పం చులు కొందరు మాత్రమే హాజరయ్యారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన రామోజీ
నవతెలంగాణ-కొడకండ్ల
ఆపదలో ఆపన్న హస్తంగా సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిందే రామోజీ అన్నారు. సోమవారం మండలంలోని రామ వరం గ్రామంలో లబ్ధిదారురాలు ఇందిరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సర్పంచ్ మందుల శిరీష మల్లేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి సహకారంతో ఈ చెక్కును అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తండా రేణుక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.