Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అర్.ఎల్.మూర్తి
నవతెలంగాణ-మహబూబాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వి చారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రా ష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి అన్నారు. సోమవారం మహబూ బాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ స మావేశం మహ-బాద్ పట్టణంలోని స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు మధు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆర్ఎల్ మూ ర్తి హాజరై మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. పేపర్ లీకేజీ వలన నష్టపోయిన ప్రతి నిరుద్యోగి నెలకు 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందిం చాలని కోరారు. బోర్డు సభ్యుల నుండి చైర్మన్ దాకా అందరినీ భర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజ్ పారదర్శకంగా విచారణ జరిపి ఎంత పెద్ద వ్యక్తులు ఉన్న కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సంఘటన పైన సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి తెలంగాణ సమాజానికి బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పేపర్ లీకేజీ పై సమగ్ర దర్యాప్తున కోరుతూ ఈనెల 11న ఇందిరాపార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలం గాణలోని విద్యారంగ సమస్యలు, నిరుద్యోగం అంశల పై ఈనెల 4,5,6 తేదీల్లో సిద్దిపేటలో రాష్ట్రస్థాయి వర్క్షాపు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుం టున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలోత్ సాయి కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు వీరబాబు, జిల్లా సహయ కార్యదర్శులు గుగులోత్ సూర్య ప్రకాశ్, గందసిరి జ్యోతి బసు జిల్లా నాయకులు పాల్గొన్నారు.