Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
గోదావరిలోయ ప్రతిఘటన పోరాట ఉద్యమ సీనియర్ నాయకురాలు నిమ్మ గడ్డ సరోజిన (బేబక్క) ఆశయ సాధనకు ఉద్యమించాలని అఖిల భారత రైతు కూ లీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పిలుపు నిచ్చారు. సోమ వారం నిమ్మగడ్డ సరోజన సంతాప సభను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహ బూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య భవనంలోపుల్లన్న అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల వెంకన్న, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్యలు మాట్లాడారు. బేబక్క 1979 నుండి విప్లవోద్యమంలో కీలక పాత్రను పోషించిందన్నారు.తనతల్లి పాలడుగు మల్లికాంబ ఇచ్చిన స్ఫూర్తితో చిన్న తనం నుండి కమ్యూనిస్టు భావజాలంతో ప్రజల కోసం క్రియాశీల కార్యకర్తగా పనిచేసిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివాసి హక్కుల కోసం, పోడు భూము ల రక్షణ కోసం అలుపెరగకుండా పోరాడిందని మహిళా అని కూడా చూడకుండా రాజ్యం బేబక్క పై బాంబు కేసులు, తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైలులో బంధించిందన్నారు. విప్లవ పార్టీ రాజకీయాలను నరనరాన జీర్ణించుకున్న వీర వనిత బేబక్క అని, బేబక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్య త ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు బొమ్మన బోయిన అన సూర్య ,ఎస్కే బాబు, సక్రు, హెచ్. లింగన్న, యాస వెంకట నారాయణతో పాటు సామ పాపయ్య, తాజ్ పాషా, తెల బోయిన లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.