Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే నెరవేర్చాలని జనగా మ మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి డిమాం డ్ చేశారు. సోమవారం మండలం లోని నెల్లుట్ల గ్రామంలో అంబెడ్కర్ చౌరస్తా సిపిఐ పార్టీ ప్రజా పోరు యాత్రలో భాగంగా జనగాం నుండి నెల్లుట్ల వద్ద ప్రజాపూరు యాత్ర రథసారథులు రాష్ట్ర నాయకులు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, పంజాల రమేష్ పలు ప్రజా సమస్యలపై ప్రసంగించారు. పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని, గిరిజన విశ్వవిద్యాలయం నిధులు కేటాయించాలని కో రారు.ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి రావుల సదానంద్,జిల్లా సహాయ కార్య దర్శి ఎం.జనార్దన్,మండల నాయకులు బర్ల అంజయ్య,మొటికే యాదగిరి, గవ్వల అబ్బ సాయిలు, గురువెందుల వెంకన్న, పి.వీరస్వామి, ఎం.కుమార్, బి.రామ్ నర్సయ్య, పి.వెంకన్న, బి.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.