Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఎంపీడీవో రవీందర్ రావు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గామ పంచాయతీ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామ ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సర్పంచ్ ఎలబోయిన సారయ్య, ఎంపీటీసీ కందాల కృ ష్ణ మూర్తి, పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్, స్థానిక వార్డు సభ్యులు బండా రు వెంకన్న, అరిగె విజేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది కారోబార్ కంచ కట్ట య్య, ఫిల్డ్అస్టెంట్ మంచాల కుమార్, కొప్పర రాజు బోనగిరి దేవేందర్ గ్రామ ప్ర జల సహకారంతో చలివేంద్ర ఏర్పాటు చేయడమైనది.