Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ ఒక గొప్ప వరం అని ఇల్లందు శాసనసభ్యురా లు బానోత్ హరిప్రియ అన్నా రు. స్దానిక రైతు వేదికలో 61 మందికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు రాము అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే హరిప్రియా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందని పంటలకు సాగునీరు అందించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.మండలంలో పల్లె నిద్ర పాదయాత్ర ద్వారా దృష్టికి వచ్చి న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సిసి రోడ్లు అన్ని గ్రామా లలో పూర్తి స్దాయిలో నిర్మించటానికి ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తామని చెప్పా రు. రాంపురం చెక్ డ్యాం పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంకు సీఎం కేసీఆర్ సహకా రంతో త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. బుద్దారం గ్రామానికి చెం దిన ముగ్గురు లబ్ధిదారులకు జీవో నెంబర్ 58,59 ద్వారా క్రమబద్ధీకరణ పట్టాల ను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మూడ్ శివాజీ చౌహాన్, సర్పంచ్ అజ్మీ ర బన్సీలాల్, ఎంపిటీసి శీలం శెట్టి రమేష్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు భూక్య మోతీలాల్, సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్, సర్పంచ్లు నూనావత్ జ్యోతి,భూక్య భారతీ,రత్నావత్ శంకర్,జి.తారాబాయి,బి.లావణ్య, కో-అప్షన్ సభ్యులు ఖదీర్,ఎంపిడివో రవీందర్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పానుగంటి రాధాకృష్ణ,డిప్యూటీ తహశీల్దారు జె.వీరన్న, బీఆర్ఎస్ నాయకులు మీ గడ శ్రీనివాస్, ఎన్.నరసింహ,బి.లక్ష్మారెడ్డి,ఎస్.రాజు,రావూజీ ఉన్నారు.