Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎస్టీ ఐక్య సంఘాల రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ నాయకులు బానోత్ రాజేష్ నాయక్ అ న్నారు. మంగళవారం నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి తెలంగాణ ప్రభుత్వంలో గిరిజనులకు, ఆదీవాసులకు పెద్దపీట వేస్తూ, లంబాడీ సమాజ ఉన్నతికి ఎంతో పాటుపడుతున్నరని, గిరిజన ఆరాధ్య దైవం సద్గురు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. మాజీ ఉప ము ఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో నియోజక వర్గ కేంద్రంలో 2కోట్ల వ్యయంతో బంజారా భవన్ నిర్మా ణానికి జీఓ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.
గతంలో 6శాతంగా ఉన్న రిజర్వేషన్ 10శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ దే అన్నారు. మారుమూల తండాలకు కూడా రహదారులునిర్మాణం,ప్రతీ తండా కొత్త గ్రామ పంచాయతీలుగా చేసి, పక్కా భవనాలు కూడా నిర్మించడం వల్ల కేసీఆర్‌కు, నియోజక వర్గ అభివృద్ధి ప్రధాత, దేవాదుల సృష్టి కర్త, డిప్యూటీ సీఎం కడియంకు రుణపడి ఉంటామని అన్నారు. ఈకార్యక్రమంలో ఫతే పూర్ సర్పంచ్ బానోత్ రుప్లా నాయక్, బిక్కు నాయక్, భూక్య సంజీవ, వెంకటేశ్వర్లు, నర్సింహ, సక్రు నాయక్, లక్ష్మి ఠాగూర్, హన్మంతు, సోమన్న, శ్రీనివాస్, రాములు, స్వామి నాయక్, తదితరులు పాల్గొన్నారు.