Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ శీలం లింగన్న గౌడ్
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
విద్యార్థులు కష్టపడి చదువుకొ ని ఉన్నత స్థాయికి ఎదగాలని వెంక టాపురం సర్పంచ్ శీలం లింగన్న గౌడ్ అన్నారు. మంగళవారం వెంక టాపురం ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినో త్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగామారి చక్కని బోధన సాగిం చారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగన్న గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు కొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. 15 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఉత్తమ ప్రతిభ కనబ రిచిన విద్యార్థులకు సొంత ఖర్చులతో జ్ఞాపకలోనూ అందజేశారు. ఈ కార్యక్రమం లో హెచ్ఎం స్వాతి, ఏఎంసీ చైర్మన్ కవిత, వైస్ చైర్మన్ శ్రీనివాస చారి, ఉపాధ్యా యులు హారిక, సుమలత, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.