Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాబార్డ్ ఏజీఎం చంద్ర శేఖర్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
మహిళలు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలు తీసుకోవాలని నాబార్డ్ ఏ జీఎం ఎల్. చంద్రశేఖర్, జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్‌లు అన్నా రు. సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ సంస్థ ఆధ్వర్యంలో మంగళ వారం డివిజన్ కేంద్రంలో బ్యాంగిల్ డిజైన్లపై మహిళలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ ఏజీఎం,జడ్పి ఫ్లోర్ లీడర్ ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టైలరింగ్, కుట్టు శిక్షణ, బ్యాంగిల్ డిజైన్ వంటి నైపుణ్యాలు నేర్చుకుంటే మహిళలు ఆర్దికంగా వృద్ధి చెందవచ్చని తెలి పారు.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, యువకులు, నిరుద్యోగులకు నాబార్డ్ సం స్థ ద్వారా శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. మహిళలు వ్యవసా యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్లు, గొర్రెలు, గేదెల పెంపకం, ద్వారా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. 18 సంవత్సారాలపై నుంచి50 సం వత్సారాల వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు, మహిళలకు, గృహి ణులకు స్వయం ఉపాధి ఆదాయ మార్గాలని వివరించారు. ఇంటి వద్దనే ఉండి ఖాళీ సమయాల్లో జ్యూట్ బ్యాగులు, మగ్గం వర్క్, కుట్టు శిక్షణ, సబ్బుల తయారీ తదితర వస్తువులను తయారీలో శిక్షణ తీసుకుని ఉపాధి పొందవచ్చునని వివరిం చారు.నాబార్డ్ అందించే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసు కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాయి స్వచ్ఛంద సంస్థ సీఈవో వెంకన్న, డిసిసిబి, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.