Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ (సీపీఆర్) గుండె పున:నిర్వహణ పట్ల ఇటీవల ప్రజల్లో అవగాహన పెరగా ల్సిన అవసరముంది. ఆపద సమ యంలో బాధితులకు తక్షణ సహా యం అందడమే కాకుండా ప్రాణాలను నిలిపే అవకాశముంటుంది. సీపీఆర్ ప్రా ముఖ్యతను గుర్తించిన ప్రభుత్వమే అధికారికంగా సీపీఆర్ అవగాహన కార్యక్రమా లు చేపడుతున్న విషయం తెలిసిందే. కాని చాలా కాలం క్రితం నుండే జనగామ కు చెందిన వైద్యులు, మిలట్రీలో కల్నల్ స్థాయిలో సేవలందించిన డాక్టర్ మాచర్ల బిక్షపతి సీపీఆర్ అవగాహన కార్యక్రమాలను స్వచ్చందంగా చేస్తున్నారు. కళాశాల ల్లో, పాఠశాలల్లో విద్యార్ధులకు, వాకర్లకు, వృద్దులకు ఎక్కడ నలుగురు గుమికూడి నా ఆయన సీపీఆర్ ప్రదర్శన చేస్తారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్లో, చేర్యా ల, మద్దూరు. పాలకుర్తి, భువనగిరి తదితర ప్రాంతాల్లో 3 వేలకు పైగా సీపీఆర్ ప్రదర్శనలిచ్చారు. సీపీఆర్ చేయడం వల్ల ఆగిపోయిన గుం డె, ఊపిరితిత్తులు తిరిగి తమ విధులను నిర్వహిస్తాయని డాక్టర్ చెప్పారు.