Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గొల్ల కురుమల ఐక్య పోరాట కమిటీ స మావేశం ముదిగిరి కుమారస్వామి అ ధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గొల్ల కురు మల ఐక్య పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు మంద రవి హాజరై మాట్లాడుతూ గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ తక్షణమే చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్ల కురుమల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గొర్రెలను మేపుకోవడానికి ప్రతి గ్రామమునకు 10 ఎకరాల భూ మి కేటాయించాలని, చెరువు కట్టల తుమ్మలు వేప చెట్లు చెరువు షికం తుమ్మలు వేప చెట్లు, ఎస్సార్ఎస్పీ కాలువల పక్కన ఉండబడిన తుమ్మ వేప చెట్లు గొల్ల కురుమల హక్కు అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. వీటి సాధన కొరకు రాష్ట్రవ్యాప్తంగా దశలవారి పోరాటాలు చేపడతామని ఆయన తెలియ జేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన గౌండ్ల యాదగిరిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్య క్షులు కంచ వెంకన్న,వేల్పుల వెంకన్న, భాష బోయిన మల్లయ్య, బండి ఎంకన్న, గౌండ్ల మల్లేష్, బండి యాదగిరి, తుప్పతి అశోక్ తదితరులు పాల్గొన్నారు.