Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివోఎల సంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్
నవతెలంగాణ-నెల్లికుదురు
గ్రామాల్లో మహిళా సం ఘాలతో విధులు నిర్వహిస్తు న్న వివోఏల సంఘం సమ స్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెలిశాల సుధాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఆ సంఘం సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించి ఏపిఎం వరదయ్యకు బ్యాంకు మేనేజర్ పర్వతనేని రాజేష్‌కు సమ్మె విరమించేంత వరకు బ్యాంకు లావాదేవీలు నడపకూడదని వినతిపత్రాన్ని మంగళవారం అందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల మూడవ తేదీ నుండి మా సంఘం సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు. ఇందుకోసం మేము ఆన్లైన్ ఆఫ్ లైన్లో పనులను బందు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 11వ తేదీన అన్ని మండల స్థాయి వివోఏలు టేబుల్ సమావేశాన్ని నిర్వ హించబోతున్నామని తెలిపారు. 14వ తేదీన వినతిపత్రాన్ని అందిస్తున్నామని అ న్నారు. వివోఏలను సర్ఫ్ ఉద్యోగులుగా తక్షణమే గుర్తించాలని మాకు కనీస వేత నం 26 వేల రూపాయలు ఇస్తూ 10 లక్షల సాధన బీమా సౌకర్యం కల్పించాలని, ఎస్‌హెచ్‌జి లైవ్ మీటింగ్‌లను తక్షణమే రద్దు పరచాలని, అర్హులైన వివోఏలను సీసీ లుగా ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు బీరు యాకయ్య, మండలఅధ్యక్షుడు గుగులోతు హనుమంతు నాయక్, కార్యదర్శి ఇందిరా, ఉపాధ్యక్షులు ఉపేందర్, నసీహత్ బేగం, అశోక్, సు జాత, విజ యలక్ష్మి, మంజుల, శ్వేత, గట్టు అశోక్, హైమావతి, రాధిక, రాము, గడ్డ ల అశోక్, సంగు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.