Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల సమష్యల పరిష్కారంతో పాటు భార త రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో పొందపర్చిన 1/70, పేసా, అటవీ హక్కుల చట్టాలను అమలుచేయాలని ఆదివాసీ హక్కులపోరాట సమితి తుడుందెబ్బ, అను బంధ సంఘాల ఆధ్వర్యంలో దశల వారీ పోరాటాలు నిర్వహిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజు అధ్యక్షతన ఆసంఘం సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా వట్టం ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీల ప్రాంతంలో ఆదివాసీలహక్కులు, చట్టాలు అమ లులో ఉండగా వలస వాదులు మాత్రం యథేచ్ఛగా ఆదివాసీల హక్కులు చట్టాల ను ఉల్లంఘిస్తూ ఆదివాసీలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సమష్యలను పరిష్కారం చేయకుండా ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేస్తూ అక్రమంగా ఎస్టీ లుగా చలామణి అవుతున్న వర్గానికి పెద్దపీట వేసి ఆదివాసీలను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేస్తుందని అన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల భాద్యత రాహిత్యంగా వ్యవహరి స్తున్న తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివాసీలను సంఘటితం చేసి ఆదివాసీల రాజ్యాంగ హక్కులను అమలు చేసే వరకు ప్రభుత్వాల పై తుడుం మోగించాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బుర్క యాదగిరి, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఆగబోయిన రవి, ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సువర్ణపాక బాబీ, దొర పటేల్ల సంఘం అధ్యక్షులు బీరబోయిన సమ్మయ్య,సిద్దబోయిన లక్ష్మి, నారాయణ, ఈక నరేష్, పెనుక సతీష్,సిద్దబోయిన జీవన్ మునేష్, బండ సమ్మయ్య,భూ పోరాట కమిటీ అధ్యక్షులు పొడుగు రామారావు బుర్క పవన్ తదితరులు పాల్గొన్నారు.