Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
మహిళలు బాగుంటేనే ఇంటికి ఆరోగ్యమని,మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వ హిస్తున్న ఆరోగ్య మహిళ ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సంద ర్భంగా ఈ పథకం నాలుగు వారాలుగా పకడ్బందీగా అమలవుతున్నదని అన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలను వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలు సుకున్నారు. గతవారం వచ్చిన మహిళలకు చేసిన పరీక్షలు వాటి నివేదికలను పరి శీలించి అధికారులకు తగిన సలహాలు సూచనలు అందించారు. అనంతరం కమి షనర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలందరూ ఆరోగ్యంగా ఉం డాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఛాతీ, ఒబేసి టీ, రక్త, మూత్ర పరీక్షలు, క్యాన్సర్ పరీక్షలు, న్యూట్రిషన్ మొదలైన పరీక్షలను స్థా నిక ఆసుపత్రిలో చేసి రోగనిర్ధారణ చేసి, నివారణ కోసం మందులు ఇవ్వడమేగా కుండా,అవసరమైతే, మెరుగైన వైద్య సేవలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలల్లోని మహిళలు వైద్య పరీక్షలు చేయించుకో లేని స్థితిలో ఈ పథకాన్ని వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్య మహిళా పథకంలో మెరుగైన పనితీరు కనబర్చిన వైద్య సిబ్బందిని కమిష నర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సుగుణాకర్ రాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓసుధీర్, వైద్యాధికారులు సంధ్యారాణి, ప్రసన్న కుమార్, సంధ్య, డీఆర్డీఓ రాం రెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, ఏపీఎం కవిత, సీహెచ్‌ఓలు సాంబయ్య, వెంకటస్వామి స్టాఫ్ న ర్సులు సునీత, రజిని, నిహారిక, ఆశాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.