Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
తెలంగాణ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరిట నిర్మిస్తున్న కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్యాదవ్ అన్నారు. కుడా కా ర్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం రోజున ప్రణా ళిక విభాగం, ఇంజనీర్ల విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నిర్మాణ పను ల్లో వేగం పెంచాలని, పనుల పురోగతిపై ప్రతీ 15 రోజులకో సారి సమీక్ష నిర్వహిస్తామని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణ పనుల్లో అలసత్వం వహిం చవద్దని సూచించారు. కవులకు, కళాకారులకు, సాంస్కతిక కార్యక్రమాలకు నెలవయ్యే ఈ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. కళాక్షేత్రానికి వన్నెతెచ్చేలా అన్ని హంగులతో ని ర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
భద్రకాళీ మాఢ వీధుల నిర్మాణం ప్రతిష్టాత్మకం
జిల్లా ప్రజలకు కొంగుబంగారం అవుతున్న శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయ మాఢ వీధుల నిర్మాణం ప్రతిష్టాత్మకమైనదని, ఆ పనులను ప్రణాళికాబద్ధంగా, ఆగ మశాస్త్ర ప్రకారం చేపట్టాలని కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అధికారులకు సూచించారు. ఆలయ ప్రకారం, రాజగోపురం, మాఢ విధుల నిర్మాణాలకు సంబం ధించిన అన్ని పనుల ప్రణాళికలను పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన మొద లయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, సెక్రటరీ మురళీధర్ రావు, డీఈ రఘునందన్ రావు, ఏఈలు సిద్ధార్థ్ నాయక్, భరత్, జలాల్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.