Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలా, డీటీసీపీ, పంచాయతీ అనుమతి తీసుకోకుంటే చర్యలు : ఎంపీవో సునిల్ కుమార్
నవతెలంగాణ-నర్సంపేట
అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్న ఫం క్షన్ హాల్‌ను ఎంపీవో సునిల్ కుమార్ సందర్శించా రు. మంగళవారం మండంలోని రాములునాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని నర్సంపేట- వ రంగల్ రోడ్డు పక్కన అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్న ఫంక్షన్‌హాల్ ప్రదేశాన్ని ఎంపీవో సునిల్ కు మార్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ కుమారి పరిశీ లించారు.అనుమతి తీసుకోకుండా నిర్మాణాలను చే యడం నిబంధనలకు విరుద్ధమని వెంటనే నిలుపుద ల చేయాలని భూ యజమాని డాక్టర్ రాజారామ్‌ను తో చెప్పారు. అనుమతి లేకుండా నిర్మాణాలను చేయ వద్దని హెచ్చరించారు. పక్కనే ఎస్సారెస్పీ కాల్వ స్థలం లో 14 మీటర్ల వెడల్పులో దాదాపు 30 మీటర్ల పొడవునా స్వాధీన పర్చుకొని ఫంక్షన్ హాల్‌కు సంబం ధించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించినట్లు ఎంపీవో చెప్పారు. వెంటనే ఇట్టి నిర్మాణాలను తొలగించి ఖాళీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఎస్సారెస్పీ ఇంజనీరు అధికారులు త గు రికార్డుల ప్రకారం పరి శీలన చేసి ఆక్రమించి ని ర్మాణాలు చేయడంపై నో టీసులు జారీచేయనున్నా రు. భూయజమాని ముం దస్తూ నాలా అనుమతి తీ సుకున్న తర్వాత తగు డా క్యూమెంట్ల ప్రకారం ఫంక్షన్ హాల్‌కు అనుమతి కి డీటీసీపీకి ఆన్లైన్ ధరఖాస్తు చేయాల్సి ఉందన్నా రు. తదిపరి అధికారుల పరిశీలన తర్వాత నిర్మాణ ఏ రియాకు సంబంధించి పూర్తి స్థాయిలో డాక్యూమెం ట్లు, నిర్మాణ నక్షపత్రాలు సవ్యంగా ఉన్నట్లయితే చి వరిగా గ్రామ పంచాయతీ తీర్మాణం మేరకు ఫంక్షన్ హాల్ అనుమతి జారీ చేస్తామన్నారు.ఇవేమీ ముంద స్తూ తీసుకోకుండనే కట్టడాలను చేపట్టడడం నిబంధ నలను ఉల్లంఘించమే అవుతుందని చెప్పారు. వెంట నే పనులను నిలుపుదల చేసి అనుమతికి ధరఖాస్తు చేయాలని ఆదేశించారు.