Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రాజకీయ లబ్ధి కోసమే బిజేపీ పేపర్ లీకేజీల వంటి దు ర్మార్గాలకు పాల్పడుతుందని పేపర్ లీకేజీ ముమ్మాటికి బండి కుట్రే అని మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిల ధ్వజమె త్తారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై బండి పాత్ర పై మంత్రి సత్యవతి ప్రకటనలో స్పందించారు.దేశంలోనే ఆద ర్శవంతమైన పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా న్ని అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం ఇ లాంటి కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రశ్న ప త్రాలు లీకేజీలో రాజకీయాల పార్టీ పాత్ర ఉండటం దుర దృ ష్టకరమన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గుచేటని మంత్రి అ న్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ప్రభుత్వాన్ని ప్ర తిష్ట పాలు చేయాలని బండి కంకణం కట్టుకున్నాడనే విష యం స్పష్టమైంది. హిందీ పేపర్ లీక్ చేసిన బీజేపీ నాయ కుడు ప్రశాంత్ వెంటనే ఆ పార్టీ అధ్యక్షునికి పంపించడం, త ర్వాత మీడియాకు సమాచారం అందించడం బీజేపీ కుట్రలో భాగమే అని అన్నారు. నిజంగా పేపర్‌లీక్ అయి ఉంటే పోలీ సులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలి. కానీ బీజేపీ నాయకుడు ఆ పార్టీ అధ్యక్షునికి పంపించి ఆయన పే పర్ లీక్ అయిందంటూ మీడియా వాళ్లకు సమాచారం అం దించి రాద్ధాంతం చేశారంటే దాని వెనుక ఉన్న కుట్రను అ ర్థం చేసుకోవాలి. టిఎస్ పీఎస్సి పేపర్ లీకేజ్ చేసిన నింది తుడు కూడా బీజేపీ కార్యకర్తనే ఇప్పుడు పదవ తరగతి పేప ర్ లీక్ పేరిట బీజేపీ నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీ సుకురావాలని చేస్తున్న బిజేపీ దుర్మార్గపు చర్యలు రెడ్ హ్యాం డెడ్‌గా బయటపడ్డాయన్నారు.పేపర్ లీకేజీ కుట్రలో ఉన్న వ్య క్తులు ఎవరైనా వదిలిపెట్టే లేదన్నారు. విద్యార్థులు జీవితాల తో ఆటలాడుకుంటున్న బీజేపిని గ్రామగ్రామాన ప్రజలు నిల దీయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు నిచ్చారు.
లీకేజీల కుట్రల పాపం బీజేపీదే : ఎమ్మెల్యే
ప్రశ్నా పత్రల లీకేజీల పాపం బిజెపి కుట్ర అని రాజకీ య లబ్ధి కోసం బండి సంజరు తెగబడ్డారని ఎమ్మెల్యే బానో త్శంకర్ నాయక్ విమర్శించారు.బుధవారం మహబూబాబా ద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ శంకర్ నాయక్ మాట్లాడారు. నూరుకు నూరు శాతం లీకేజీ కుట్ర బండిదే అని, లీకేజీ కుట్ర ల పాపం బీజేపీ పార్టీదేనని, మీ స్వార్ధ రాజకీయాన్ని విద్యా ర్థుల జీవితాలతో ముడి పెట్టవద్దని, ప్రజలు బిజెపి నాయకు ల పద్ధతిని గమనిస్తున్నారు, ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి లేదంటే ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి, విమర్శించారు. టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ చేసింది మాజీ టివి జర్నలిస్ట్ ప్రశాంత్ బండి సంజరు అనుచరుడు కదా అని మండిపడ్డారు. కేసీఆర్‌ని నేరుగా ఎదుర్కోలేక బీజేపీ ఇలా దొంగ పద్ధతులను అనుసరిస్తుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మత చిచ్చు ప్రయత్నాలు ఫలించక పో డంతో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో ఆడ ుకుంటుంది అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గద్దె రవి, గోగుల రాజు, యువ నాయకులు యాళ్ల మురళీధర్ రెడ్డి, పాల్గొన్నారు.