Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ
నవతెలంగాణ-మహబూబాబాద్
బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల సందర్భంగా గౌడ ఆత్మీయ సమ్మేళనం లో గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని ఛలో ప్రగతి భవన్ కార్యక్రమం చేపడతామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ అన్నారు. బుధ వారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్విఎం ఫంక్షన్ హాల్లో కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లా డుతూ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలో వేలాదిమంది గీత కార్మికులతో జరిగిన బహిరంగ సభలో 25 తీర్మానాలు చేసి ప్ర భుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశామన్నారు. ఆ తర్వాత మునుగోడు ఎన్నిక ల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడుతూ మేము పెట్టిన కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు. గీతన్న బంధు, గీతన్న బీమా, 10 రోజులలో ఎక్స్గ్రేషియా, సొసైటీలకు లిక్కర్ షాపులు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎలాంటి ఉద్యమాని కైనా సిద్ధం కావాలని గీతా కార్మికులకు పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటా యించిన డబ్బులు విడుదలచేసి తాడికార్పొరేషన్కు ఇవ్వాలని తద్వారా సేఫ్టీమోకు లు ద్విచక్ర వాహనాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. మహ బూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమగాని వెంకన్న, గౌని వెంకన్న మాట్లా డుతూ జిల్లాలో గీతవృతి చేసే వాళ్ళందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు, ఇవ్వాలని కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన వారికి కోరిన చోట సొసైటీలకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎక్కడైనా గీతా వృత్తిలో ప్రమాదానికి గురై న వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్న సుప్రజా హాస్పిటల్ ఎండి శిగ విజరు కు మార్ గౌడ్, పేదవారికి ఆర్థిక సహాయం చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామిను తెలంగాణ కల గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నర్సయ్య, వెంకటమల్లు, పానమల్లు అచ్చాలు, కార్యదర్శు లు ఎస్.రమేష్ గౌడ్, చౌదరి సీతారాములు, గాలి అంజయ్య, మహబూబాబాద్ జి ల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పలయ్య, మేకపోతుల అంజయ్య, పానుగంటి వీరస్వామి, తండ రాములు, డొంకెన రామన్న, శీలం సత్య నారాయణ, వెంకటేశ్వర్లు, మోహన్, జిల్లా సోషల్ మీడియా కన్వర్ గాడి పెళ్లి శ్రీని వాస్, సిద్దిపేట శ్రీనివాస్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.