Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన కడియం కావ్య
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో వ్యవసాయ మహిళా కూలీల సమస్య లపై చర్చించేందుకు, వారిని చైతన్య పరిచేందుకు ఈ నెల 20, 21 తేదీలలో జనగామలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కడియం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య పిలుపు ని చ్చారు. బుధవారం హనుమకొండలోని తన కార్యాల యంలో రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆమె సంఘనాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదర్శ జీవి పుచ్చల పల్లి సుందరయ్య స్థాపించిన అఖిలభారత వ్యవసా య కార్మిక సంఘం (ఏఐఏడబ్య్లూయూ)అనుబంధ సంఘంగా నిత్యం వ్యవసాయ కూలీల సమస్యలపై పనిచేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుప తలపెట్టిన ఈ సదస్సుకు అన్ని తరగతుల ప్రజానీకం సహకరించి జయప్రదం చే యాల్సిందిగా కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదల వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ ఉండడం వల్ల వీరి బ్రతుకులు మరింత దుర్భరంగా మారుతు న్నాయనీ, నిత్యావసారాల వస్తువుల ధరలు విపరీతం గా పెరగడం, చేద్దామంటే పనులు దొరకకపోవడం, రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చిన సంపాదనంతా వైద్య ఖర్చులకే సరిపోవడం వల్ల రెండు పూటలా తిం డి దొరికే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. దేశంలో సుమారు 40 కోట్ల మంది ప్రజలు దరిద్రరే ఖకు దిగువన చేరారని, దీనికి కారణం ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని అన్నారు. జా తీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసి దీనికి కే టాయిస్తున్న డబ్బుల్ని కార్పొరేట్లకే కట్టబెట్టే కుట్ర బీజేపీ చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. సా మాజికంగా వెనకబడ్డ దళితుల మీద, మహిళల మీద దాడులు గతం కంటే ఎన్నో రేట్లు పెరిగాయని ఆవేద న వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా, పేదలను చైతన్య పరచడం కోసం ఉద్దేశించిన రాష్ట్ర చైతన్య సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మరోసారి డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పుల్ల రాజేశ్వరి, గడ్డం రేణుక, శనగచర్ల మాధవి, ప్రశాంతి, లావణ్య, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.