Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ విభజన చట్టాల హామీల అమలుకై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వ ర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న ప్రజా పోరు యాత్ర ముగింపు సమావే శానికి బుధవారం సీపీఐ నాయకులు తరలి వెళ్లారు. తొర్రూర్‌లో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు ఓమా బిక్షపతి మాట్లాడారు. మార్చి 25న బయ్యారంలో ప్రారంభమైన ప్రజా పోరు యాత్ర పది రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం చేసి బుధవారం ముగింపు సభ నిర్వహిస్తుంది అని తెలిపారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ము లుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని, హైదరాబాదు నుండి జన గామ వరకు కారిడార్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, పోడు భూములకు పట్టా లు ఇవ్వాలని, ఇల్లులేని పేదవారు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇచ్చి వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టేయాలని, తెలంగా ణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని ప్రజా పోరు యాత్ర ముందు కు సాగిందని, ప్రజాపోరు యాత్ర ముగింపు సభ హనుమకొండలోని కూడా గ్రౌం డ్లో జరుగుతున్న సందర్భంలో తోరూర్ మండలం నుండి 150 మంది కదిలి వెళ్లా రు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, సహాయ కార్యద ర్శిలు బందు మహేందర్, మంగళపల్లి మల్లయ్య, పట్టణ కార్యదర్శి ముద్రపైన వెంకన్న, ఏఐటియుసి నాయకులు సురబోయిన వీరన్న, జిల్లా నాయకులు జి.లక్ష్మ ణ్, మాజీ సర్పంచ్ మామిళ్ళపల్లి రమేష్, ధర్మారం ఎల్లయ్య, వెలిశాల ప్రభాకర్, పసుల యాకయ్య, నల్లగంటి వెంకన్న, మం గళపల్లి యాకయ్య, మంగళపెల్లి వెం కటకృష్ణ, వార్డు సభ్యులు కోటగిరి సంతోష్, కోటగిరి ఏకాంతం పాల్గొన్నారు.
ప్రజా పోరు యాత్రకు తరలిన మానుకోట సీపీఐ శ్రేణులు
మహబూబాబాద్ : సీపీఐ ప్రజా పోరు యాత్ర ముగింపు బహిరంగ సభ సం దర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి 700 మంది సీపీఐ పార్టీ శ్రేణులు మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బి.అజరు సారథి రెడ్డి అధ్వర్యంలో వరంగల్ కు తరిలి వెళ్ళారు. ఈ సందర్భంగా అజరు సారథిరెడ్డి మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యునివర్సిటీ సా ధనకై సీపీఐ దశలవారీ మిలిటెంట్ పోరాటాలు నిర్వహించడం జరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్, రేశపళ్ళీ నవీన్, చింటకుంట్లా వెంకన్న, మ మిండ్ల సాంబ లక్ష్మి, వీరవెళ్లి రవి, వెలుగు శ్రావణ్, కేడాసు రమేష్ పాల్గొన్నారు.