Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని జమాల్లపల్లి గ్రామా న్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆదేశించారు. బుధవారం మహబూబాబాద్ మున్సి పల్ పరిధిలోని 2, 3 వార్డులలో పర్యటించి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సలహా లు సూచనలు మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్ట ర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, డీఈ ఉపేందర్, మార్నేని వెంకన్న, గద్దె రవి, ప్లోర్ లీడర్ చిట్యాల జనార్ధన్, స్థానిక కౌన్సిలర్లు బండి ఇందిరా వెంకన్న, అంబాల జ్యోత్స్నా శివ, గోగుల రాజు, ఏఈ సురేష్ పాల్గొన్నారు.