Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం
- ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
నవతెలంగాణ-చిట్యాల
ఇటీవల కురిసిన వడగళ్లవారి కారణంగా రైతుల పం టలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం సర్వే చేపట్టాల ని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే వాటిని తుంగలో తొక్కి నష్టపోయిన రైతుల పంట సర్వే చేయ కుండా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. తూ తూమంత్రంగా ఇష్టారాజ్యంగా సర్వే చేశారని పారద ర్శకంగా చేపట్ట లేదని మండలంలోని నవాబుపేట గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు చెక్క శ్రీను, రాజయ్య, రాజకుమార్, రాములు, లింగయ్య, శ్రీను వారి గోడును నవతెలంగాణకు వెలిబుచ్చుకున్నారు. గత 15 రోజుల క్రితం కురిసిన రాళ్ల వర్షం కారణంగా రైతులు, కౌలు రైతుల పంటలు పెద్ద మొత్తంలో నష్టపో యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు రూ.10,000 చొప్పున పంట నష్టపరిహారం ఇస్తా అని ప్రకటించిన విషయం విధితమే. సర్వే చేపట్టాల్సిందిగా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్ సర్వే చేయడంలో నిజమైన రైతులను వదిలేసి ఇష్టారాజ్యంగా సర్వే చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి వ్యవసాయ అధి కారులను సర్వే కోసం తమ గ్రామాల్లోకి పంపించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సర్వేలో ప్రజాప్రతినిధుల పలుకుబడి ఉపయోగించి వారి పేర్లను నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.