Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుకుబడి ఉన్న వారికే వర్తింపు
- నిరుపేదలకు వర్తించని రిజిస్ట్రేషన్లు
- ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్
నవతెలంగాణ-గణపురం
గాంధీనగర్. మైలారం. కర్కపల్లి. గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూముల్లో రియల్ దందా కొనసా గుతోంది. ప్రభుత్వ భూముల్లో కొందరు వారి పలు కుబడి ఉపయోగించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేప ిస్తున్నారు. నిరుపేదల భూములకు మాత్రం రిజి స్ట్రేషన్లు వర్తించడం లేదు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి పలుకుబడితో దొంగ చాటుగా ములుగు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రే షన్లపర్వం కొనసాగిస్తున్నారు. నిరుపేదల భూము లకు మాత్రం కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ వారి భూములు మాత్రం రిజిస్టర్ రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దీంతో నిరుపేదలు ఆందోళన చెం దుతున్నారు. ఒకరి భూములు రిజిస్ట్రేషన్ అయ్యి తమ భూములు ఎందుకు రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని వా పోతున్నారు. గాంధీనగర్ గ్రామం మొత్తం ప్రభుత్వ భూమి కావడం ఎవరు పడితే వారు ఇష్టం ఉన్నంత భూమిని ఆక్రమించుకొని రి యల్ దందాను కొనసాగిస్తున్నారు. రియల్ దందా చేసేవారి భూములు మాత్రం రిజిస్ట్రేషన్లు జరుగు తుండగా తక్కువ భూమి ఉన్న నిరుపేదల భూము లు మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ప్రభు త్వ భూమి రిజిస్ట్రేషన్ అసలే కాదు. అయినప్పటికీ ఒక వ్యక్తి దొంగ చాటుగా రిజిస్ట్రేషన్లు చేపించి. ఆ భూములను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ కాదు. గ్రామపంచాయతీలో ఇంటి నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అవుతుంది. కానీ గ్రామపంచాయతీలో ఇంటి నెంబర్ లేకున్నప్పటికీ ఎకరాలకు ఎకరాలు రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందో అర్థం కాని పరిస్థితి. ములుగు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక ప్రవేట్ వ్యక్తి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూమి ఎవరి పేరు మీద ఉంటే వారే బాధ్యులుగా ఉం టారు. పేరు మార్పిడి అసలే కాదు. భూమి ఆక్ర మించుకున్న వ్యక్తి అమ్మిన కొన్న నేరమే ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గాంధీనగర్ గ్రామం మొత్తం ప్రభుత్వ భూమి కావడం వల్ల గ్రా మస్తులు గతంలో ధర్నాలు చేశారు. తమ భూ ములను ప్రభుత్వ భూమి నుండి మార్పిడి చేయా లంటూ ఆందోళనలు చేపట్టారు. అప్పటి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గ్రామస్తులకు హామీ కూడా ఇచ్చారు . 59 జీవో ప్రకారం ప్రభుత్వ భూమి ఇంటి స్థలం కోసం రెగ్యులరేషన్ కోసం మీ సేవలో దరఖాస్తులు కూడా గ్రామస్తులు చేసుకుం టున్నారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఎకరా లకు ఎకరాలు రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పం దించి గాంధీనగర్ గ్రామంపై దృష్టి సారించి రియ ల్దందాకు చెక్కు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.