Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలో సుమారు రెండు నెలల క్రితం నుండి లింగాల, బంధాల ఏజెన్సీ గ్రామపంచాయ తీలలో 11 కెవి లైన్ స్ట్రెంతనింగ్ పనులు విద్యుత్ శాఖ నిర్వహిస్తోంది. బుధవారం ములుగు జిల్లా ఎంన్పీడీసీఎల్ డీఈ పులుసం నాగేశ్వరరావు పనులను సందర్శించి పరిశీలించారు. లింగాల, బంధాల ఏజెన్సీ గ్రామపంచాయతీలోని గ్రామాల లో విద్యుత్ అంతరాయం లేకుండా ఉన్న విద్యుత్ లైన్ ను మరమ్మతులు చేసి, నాణ్యతమైన విద్యు త్తును అందిస్తున్నట్లు తెలిపారు. పనులు వెంటనే పూర్తి చేయాలని విద్యుత్ లైన్ మరమ్మతులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎండాకాలంలో వచ్చే గాలి దుమారాలకు, రానున్న వర్షాకాలంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుం డా గ్రామాలలో నిరంతర విద్యుత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఆయనవెంట స్థానిక సర్పంచ్ ఊకే మౌనిక నాగేశ్వరావు, లింగాల బంధాల జిపి ఉద్యోగ సంఘాల కోఆర్డినేటర్ ఈక లక్ష్మీ నారాయణ, సీల్వెల్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్, సూపర్వైజర్లు, తదితరులు ఉన్నారు.