Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో పరీక్షల పేపర్ లీక్ చేసింది బీజేపీ నాయ కులు అని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెర్గం వెంకటరాణి సిద్ధు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్ అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అర్భన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీలో నింది తుడైన సంజరు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగల వెంకటరాణి సిద్ధు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బుర్ర రమేష్ మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ప్రజా వ్యతిరేఖ పాలనను కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్ నేతత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ను అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో కుట్రపూరితమైన వా తావరణాన్ని సష్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ, ఈడీ దాడులు చేపిస్తూ, కేసులు వేస్తూ కోర్టులను తిప్పుతున్నారన్నారు. బండి సంజరు రాష్ట్రం లోని పదవ తరగతి చదువుతున్న 5 లక్షల మంది విద్యా ర్థులను అయోమయం చేసే విధంగా, వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసేలా పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసే స్కాంలో ఉండటం సిగ్గుమాలిన చర్యల అన్నారు. బీజేపీ కుట్రలను దేశ ప్రజలు గమనిస్తుర న్నారు. బీజేపీ నాయకులు మున్ముందు రోజుల్లో తెలం గాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు. నీళ్లు నియమాకాలు పేరుతో సాధించుకున్న తెలం గాణలో సీఎం కేసీఆర్ సురక్ష పాలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకా శాలు కల్పించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలు నిర్వహి స్తుంటే బండి సంజరు తన అనుచరులతో కలిసి పేపర్ లీకేజీలు చేస్తున్నాడన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిం చారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ ఎదురుకోలేకనే, పనికి మాలిన చిల్లర చర్యలకు బండి సంజరు పాల్పడు తున్నాడన్నారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిదులను, నాయకులను భూపాలపల్లి పోలీస్‌లు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్, కౌన్సిలర్లు నూనె రాజు, శిరుప అనిల్, ముంజంపెల్లి మురళీధర్, మంగళపెల్లి తిరుపతి, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, చల్ల రేణుక, ముంజాల రవీందర్, భారత జాగతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి, నాయకులు పానుగంటి శ్రీనివాస్, బీబీచారి, రాయమల్లు, పిల్లలమర్రి నారాయణ, లతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.